మహిళల వన్డే ప్రపంచకప్‌.. విజయవాడలో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌

మహిళల వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ను వీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ఆధ్వర్యంలో ఫ్యాన్‌ పార్క్‌ను సిద్ధం చేసి, బిగ్‌ ఎల్‌ఈడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. శాప్‌ ఛైర్మన్‌ రవి నాయుడు మాట్లాడుతూ, ప్రతి జిల్లా క్రీడాప్రాధికార సంస్థ వద్ద ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భారత్‌ విజయం సాధించాలని దేశమంతా ఆకాంక్షిస్తోందని చెప్పారు.

సంబంధిత పోస్ట్