TDP ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగిన మహిళలు (వీడియో)

AP: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలోని సారవకోట మండలం సత్రం గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిని స్థానిక మహిళలు నిలదీశారు. తమకు అన్యాయం జరిగిందని, టీడీపీ నాయకులు కక్ష కట్టి తమ ఇల్లు కూల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండిపోదు” అంటూ ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చేసేది ఏం లేక ఆయన వెనుదిరిగారు. ఈ ఘటన గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది.

సంబంధిత పోస్ట్