వైసీపీకి భవిష్యత్ లేదు: మంత్రి డీబీవీ

AP: వైసీపీపై మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ డకౌట్ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఆ పార్టీకి ఇక భవిష్యత్ లేదనేది బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో జగన్ కు అర్థమైందని అన్నారు. ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నవరత్నాల్లో ఒక్క రత్నమైనా జగన్ కోతల్లేకుండా అమలు చేశారా అని ఆయన ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్