AP: కూటమి ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం వైసీపీ మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి తలారి రాజ్ కుమార్‌ను ప్రభుత్వం తొలగించింది. అధికార దుర్వినియోగం చేశారనే ఆరోపణల కారణంగా అతనిపై వేటు వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో షోకాజ్ నోటీసులు పంపినా రాజ్ కుమార్ స్పందించక పోవడంతో.. ఏపీ మున్సిపాలిటీ చట్టం 1965 ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంది.