ఆర్కే బీచ్‌లో యువతి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

AP: విశాఖపట్నంలోని కంచరపాలెంకు చెందిన ఒక యువతి ఇంట్లో గొడవల కారణంగా ఆత్మహత్య చేసుకోవడానికి ఆర్కే బీచ్‌కు వెళ్లింది. కుటుంబ సభ్యులు 112కు ఫిర్యాదు చేయగా.. మహారాణిపేట పోలీసులు అప్రమత్తమయ్యారు. బీచ్ రోడ్డులో సాగర్ తీరం వద్ద యువతిని గుర్తించి, ఆమెను కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులను పలువురు ప్రశంసించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్