ప్రధాని మోదీపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

AP: ప్రధాని మోదీపై వైఎస్‌ షర్మిల ఎక్స్‌ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు సభలో మోదీ దీపావళి టపాకాయ తుస్సుమందని వ్యంగ్యంగా ఎద్దేవా చేశారు. ఏపీకి వచ్చినా, అసలు ఉద్దేశ్యం బీహార్‌ ఎన్నికల ప్రచారమేనని విమర్శించారు. శ్రీశైలం మల్లన్న సాక్షిగా నీచ రాజకీయాలకు తెరలేపి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. మోదీకి నిజమైన చిత్తశుద్ధి ఉంటే శ్రీశైలం ఆలయ అభివృద్ధికి ఒక్క రూపాయి అయినా ఇచ్చారా..? అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్