కడప జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన ఈ కార్యక్రమాలలో, పోలీస్ అధికారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. వాహనదారులకు పలు ముఖ్యమైన సూచనలు చేస్తూ, వాహన తనిఖీలు చేపట్టారు.