కడప భారతీయ జనతా పార్టీ నాయకుడు గోవింద గణేష్ అరుణాచలంలో పూజ నిర్వహించారు. భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పరిపాలన సుభిక్షంగా జరుగుతుందని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో దేశ ప్రజలకు మంచి పరిపాలన అందించే గొప్ప నాయకుడి ఆరోగ్యం బాగుండాలని దేవస్థానం నందు పూజా కార్యక్రమాలు చేశారు.