పులివెందులలో యు ఎస్ ఓ ఆధ్వర్యంలో పీస్ మార్చ్

పులివెందుల పట్టణంలోని గాంధీ కూడలి నుంచి యునైటెడ్ స్కూల్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన పీస్ మార్ను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ప్రపంచంలో శాంతి, సౌభ్రాతృత్వం, సమానత్వం, సహజీవన విలువలు మరింత బలపడేలా యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ తరహా కార్యక్రమాలు విద్యార్థుల్లో బాధ్యతా భావాన్ని పెంపొందించడమే కాకుండా సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్