పులివెందుల మున్సిపల్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ రాముడు ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మెప్మా సీఎంఎం నాగలక్ష్మి మాట్లాడుతూ, జీఎస్టీ తగ్గింపుపై డ్వాక్రా సంఘాలతో సమావేశాలు నిర్వహించి ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిబ్బంది, ఆర్పీలు పాల్గొన్నారు.