AP: నర్సాపురం వైసీపీ పార్లమెంటు పరిశీలకుడు మురళి కృష్ణంరాజు 76 ఏళ్ళ వయసులో కూడా తన పాడు బుద్ధి చూపిస్తూ, వై'కామా' నేత అనిపించుకున్నారు అని టీడీపీ ఆరోపించింది. పెన్షన్ ఇవ్వటానికి ఇంటికి వెళ్ళిన మహిళా పోలీసును లైంగికంగా వేధించాడని పేర్కొంది. పోలీసులు దీనిపై విచారణ చేస్తుంటే, జగన్ మాత్రం తన సోషల్ మీడియాలో 76 ఏళ్ళ వ్యక్తిని వేధిస్తున్నారు అంటూ బాధ పడిపోతున్నారని మండిపడింది.