AP: మాజీ సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ శాసనసభా పక్ష సమావేశం జరుగుతోంది. దీనికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు హాజరయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, రైతు సమస్యలపై చర్చిస్తున్నారు. మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాజీ సీఎం జగన్ చర్చిస్తున్నారు.