ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీలో పురావస్తు శాఖ తవ్వకాల్లో 100 ఏళ్ల క్రితం ట్రాక్టర్ వెలుగులోకి వచ్చింది. ఆవిరితో నడిచే ఈ ట్రాక్టర్‌ను పొలాలు దున్నడానికి, కాలువల నిర్మాణంలో సామాగ్రిని తరలించడానికి వాడేవారని పురవాస్తు శాఖ అధికారులు వెల్లడించారు. బ్రిటిష్ పాలనలో ఇలాంటి 8 ట్రాక్టర్లను భారతదేశానికి తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ ట్రాక్టర్‌కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.