అమెరికాకు చెందిన ఎస్ఎస్ మెడీనా అనే 111 ఏళ్ల నౌకను హోటల్‌గా మార్చారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఈ నౌక సేవలందించింది. 3,60,000 నాటికల్ మైళ్లు ప్రయాణించిన ఈ నౌక 100 దేశాలను చుట్టింది. 15 ఏళ్ల కిందట ఇండోనేసియాలోని బింటాన్ భూభాగంపై ఎస్ఎస్ మెడీనా సేవల నుంచి తప్పుకుంది. దీన్ని సింగపూర్‌కు చెందిన వ్యాపారవేత్త ఎరిక్ సా కొనుగోలు చేసి, రూ.153 కోట్లతో విలాసవంతమైన హోటల్‌గా మార్చారు.