170 మంది మావోయిస్టులు లొంగుబాటు.. అమిత్ షా కీలక ప్రకటన

మావోయిస్టు పార్టీ కీలక నేత మల్లోజుల వేణుగోపాల్‌రావు లొంగిపోయిన రోజే ఛత్తీస్‌గఢ్‌లో మరో 170 మంది మావోయిస్టులు సమాజంలో కలిశారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. రెండు రోజుల్లో మొత్తం 258 మంది లొంగిపోయారని చెప్పారు. భారత రాజ్యాంగంపై విశ్వాసం వ్యక్తం చేసిన వీరిని అమిత్ షా అభినందించారు. 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని పునరుద్ఘాటించారు.

సంబంధిత పోస్ట్