పండగల నేపథ్యంలో 170 ప్రత్యేక రైళ్లు నడపుతామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దసరా, దీపావళి పండగ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంది. అందులో ముఖ్యంగా సెప్టెంబర్ 7వ తేదీ తిరుపతి-చర్లపల్లికి నాలుగు రైళ్లు నడవనున్నాయి. అలాగే అక్టోబర్ 1 నుంచి నవంబర్ 26 వరకు ప్రతి బుధవారం తిరుపతి–హిస్సార్ (07717) రైలు, అక్టోబర్ 5 నుంచి నవంబర్ 30 వరకు ప్రతి ఆదివారం హిస్సార్–తిరుపతి (07718) రైలు నడవనుంది.