ఉత్తర్‌ప్రదేశ్‌లో రూ.1.5 లక్షల విలువైన నాణేలతో రూపొందించిన శ్రీరాముడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 18 అడుగుల ఎత్తు గల ఈ విగ్రహాన్ని లఖ్‌నవూలోని ఓ షాపింగ్ మాల్‌లో ఏర్పాటు చేయగా.. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ ఆవిష్కరించారు. 1, 5, 10 రూపాయల నాణేలతో నిర్మించిన ఈ విగ్రహం ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. లఖ్‌నవూ, గోరఖ్‌పూర్, కోల్‌కతా నుంచి వచ్చిన 25 మంది శిల్పులు 20 రోజుల పాటు కృషి చేసి ఈ విగ్రహాన్ని తయారు చేశారు.