భక్తులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో తిరుపతి–షిర్డీ మధ్య 18 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడపనుంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రత్యేక రైలు సర్వీసులు కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు. టూర్ ప్లాన్ చేసే భక్తులు ముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలని సూచించారు.