ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో మంగళవారం హైదరాబాద్‌కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనే భక్తుడు తన కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం, ఆయన రూ.30 లక్షల విలువైన 22 కేజీల భారీ వెండి గంగాళాన్ని శ్రీవారికి విరాళంగా సమర్పించారు. ఆలయ అధికారులు భక్తుడికి స్వామి వారి తీర్థప్రసాదాలను అందించారు.