అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ హఠాన్మరణంతో అస్సాం రాష్ట్రం శోకంలో మునిగిపోయింది. శుక్రవారం సింగపూర్‌లో మృతి చెందగా.. ఆయన భౌతికకాయం ఆదివారం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడ నుంచి గౌహతికి ఆ తరువాత గార్గ్ నివాసమైన కహిలిపారా వరకు వెళ్తున్నప్పుడు.. అభిమానులు, స్థానికులు ఆయనను చివరి చూపు చూసేందుకు పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో కనీసం 25 కిలోమీటర్ల ట్రాఫిక్ జాం ఏర్పండిందంటే అతనికి ఎంత ఫాలోయింగ్ ఉందో అర్థమవుతుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.