భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బీఈఎంఎల్ లిమిటెడ్‌లో 440 పోస్టులకు దరఖాస్తు గడువు ఇవాళ ముగియనుంది. సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు NCT సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 29 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వయో సడలింపు ఉంటుంది. నెలకు జీతం రూ.40 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు ఇస్తారు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేసన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.