ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5.10 లక్షలు విక్రయించింది. 2020 జనవరిలో విక్రయాలు ప్రారంభించిన చేతక్ ఈవీ వాహనాలు కేవలం మూడేళ్లలోనే 5,10,000 అమ్ముడయ్యాయి. ఈ మొత్తం అమ్మకాల్లో 2.06 లక్షల యూనిట్లు గత 10 నెలల్లోనే విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. దీంతో ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల జాబితాలో చేతక్ అగ్రస్థానంలో నిలిచింది.