ఫ్రాన్స్ ఆహార భద్రతా సంస్థ (ANSES) జరిపిన అధ్యయనంలో గాజు సీసాల్లోని పానీయాలలో ప్లాస్టిక్ బాటిళ్ల కంటే 50 రెట్లు ఎక్కువ మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని తేలింది. ముఖ్యంగా బీరు, వైన్, కూల్ డ్రింక్స్ వంటి పానీయాలు గాజు సీసాల్లో ఉన్నప్పుడు ఈ కణాలు ఎక్కువగా కనిపించాయి. మనం ప్లాస్టిక్ కంటే గాజు సీసాలు సురక్షితమని భావించినప్పటికీ, ఈ అధ్యయనం ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించింది.