ఓటర్లకు చేరకముందే చెరువులో 500 ఓటరు కార్డులు..!

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్ జిల్లా బిజావర్‌లో చెరువులో వందలాది ఓటరు కార్డులు లభ్యమవడం కలకలం రేగింది. చెత్త తొలగింపు పనుల్లో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు చెరువులో సుమారు 500 ఓటరు కార్డులు గుర్తించారు. అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్డులు ఓటర్లకు చేరకముందే మాయమయ్యాయని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్‌ తీవ్రస్థాయిలో స్పందించి ఎన్నికల కమిషన్‌ను వివరణ కోరింది.

సంబంధిత పోస్ట్