13 ఏళ్ల బాలికపై 75 సంవత్సరాల పూజారి లైంగిక వేధింపులు

తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. కుంభకోణం సమీపంలోని తిరువాలంచుజి ఆలయంలో 13 ఏళ్ల బాలికపై 75 ఏళ్ల ఆలయ ప్రధాన పూజారి విశ్వనాథ అయ్యర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. సెప్టెంబర్‌ 8న కుటుంబంతో ఆలయానికి వచ్చిన బాలిక ఒంటరిగా నైవేద్యం సమర్పించడానికి వెళ్తుండగా ఈ దారుణం జరిగింది. ఘటనను బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణలో ఆరోపణలు నిజమని తేలింది. దీంతో పూజారిని పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్