బస్సు డ్రైవర్‌ వెనుక నుజ్జునుజ్జు అయిన 8 సీట్లు

TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతిచెందారు. ప్రమాదం సమాయంలో బస్సులో 70 మంది ఉన్నారు. ప్రమాదం ధాటికి బస్సు కుడి వైపు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. బస్సు డ్రైవర్‌ వెనుక ఉన్న 8 సీట్లు ధ్వంసమయ్యాయి. టిప్పర్ పడిపోవడంతో అందులో ఉన్న కంకర బస్సులో పడిపోయింది. దీంతో డ్రైవర్‌ వెనక 8 సీట్లలో కూర్చుకున్న ప్రయాణికులు కంకరలో చిక్కుకుపోయారు. దీంతో వారంతా అక్కడికక్కడే మరణించారు.

సంబంధిత పోస్ట్