35 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్న 75 ఏళ్ల వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన యూపీలోని జౌన్‌పూర్ జిల్లాలో జరిగింది. సంగ్రూరామ్(75) అనే వృద్ధుడు సెప్టెంబర్ 29న జలాల్పూర్ ప్రాంతానికి చెందిన మన్భవతి (35) అనే మహిళను కోర్టు ద్వారా వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత అతను ఒక ఆలయంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే వారి మొదటి రాత్రి రోజే సంగ్రూరామ్ అకస్మాత్తుగా మరణించాడు. వృద్ధుడి మేనల్లుడు ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసును హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.