మనుషుల్లోనూ, జంతువుల్లోనూ తల్లి ప్రేమ ఒకేలా ఉంటుందని నిరూపించింది ఈ ఘటన. మహారాష్ట్రలోని సతారాలో తన కూనతో కలిసి చిరుత పులి రోడ్డు దాటుతోంది. అటువైపు వెళ్తున్న ఓ వాహనం ఢీకొనడంతో చిరుత కూన మరణించింది. రోడ్డుపై పడి ఉన్న బిడ్డ ఎంతకీ లేవలేదు. దీంతో ఆ చిరుత బిడ్డ దగ్గరకు వచ్చి పంటితో నోట కరిచి పైకి లేపే ప్రయత్నం చేసింది. కానీ బిడ్డ చనిపోవడంతో ఏమీ చేయలేక కళ్లలో నిస్సహాయత, బాధ కనిపించాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.