స్నేహితుల మధ్య గొడవ.. ఒకరు దారుణ హత్య

TG: హైదరాబాద్‌లోని పహాడిషరీఫ్ పీఎస్ పరిధిలోని జల్పల్లి మున్సిపాలిటీ, శ్రీరాం కాలనీ ఎర్రచెరువు వద్ద ఉన్న ఓ కంపెనీలో శుక్రవారం ఒక వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. తివారి(35), ఇమ్రాన్ అనే ఇద్దరు స్నేహితుల మధ్య చెలరేగిన చిన్న గొడవ తీవ్రమై హత్యకు దారితీసింది. ఇమ్రాన్, అతని స్నేహితులు కలిసి రాడ్లతో తివారిని కొట్టి చంపినట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్