TG: హైదరాబాద్ యాకుత్‌పురాలో ఓ చిన్నారికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆరేళ్ల బాలిక స్కూల్‌కు వెళ్తుండగా ఓపెన్ డ్రెయిన్‌లో పడిపోయింది. వెనకాలే వస్తున్న మహిళ గమనించి వెంటనే బాలికను బయటకు తీశారు. దీంతో బాలికకు ప్రాణాపాయం తప్పింది. మూత తెరిచి ఉంచడంతో ఈ ప్రమాదం జరిగిందని.. అధికారులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై బాలిక తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.