మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లాలో ఉన్న కియోటి జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇది దేశంలోనే 24వ ఎత్తైన జలపాతం కావడం విశేషం. ఈ వాటర్ ఫాల్స్ ఎత్తు 98 మీటర్లు (322 అడుగులు). టోన్స్ (తమ్సా) నదికి ఉపనది అయిన మహానా నది ద్వారా ఈ జలపాతం ఏర్పడుతుంది. వర్షాకాలం కావడంతో జలపాతం అందాలను వీక్షించేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. ఈ జలపాతం వీడియోను మీరూ చూసేయండి.