ఆడ వేషంలో వెళ్లి స్నేహితుడి ఇంటికి కన్నం వేసిన వ్యక్తి

TG: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఓ స్నేహితుడి ఇంట్లో చోరీ జరగింది. ఉదయ్ నగర్‌కు చెందిన శివరాజ్ ఈ నెల 16న కుటుంబంతో నిజామాబాద్ వెళ్ళాడు. ఇదే అవకాశంగా తీసుకున్న అతని స్నేహితుడు హర్షిత్.. ఆడ వేషంలో వెళ్లి ఇంటి తాళాలు పగలగొట్టి 6.75 తులాల బంగారం, ₹1.10 లక్షల నగదు చోరీ చేశాడు. శివరాజ్ కుటుంబం తిరిగి వచ్చాక జరిగిన మోసం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాలు, క్లూస్ ఆధారంగా హర్షిత్‌ను అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్