బాలికను వేధించిన ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి నగ్నంగా ఊరేగించారు. ఈ ఘటన కశ్మీర్‌లో చోటుచేసుకుంది. కశ్మీర్‌లోని ఓ గ్రామంలో ఓ వ్యక్తి బాలికను వేధించాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు అతడిని దుస్తులు లేకుండా ఊరంతా ఊరేగించారు. తీవ్రంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు తాజాగా నెట్టింట వైర్ అవుతున్నాయి. కాగా, అతడు కొంతకాలంగా సదరు బాలికను వేధిస్తున్నట్టు గ్రామస్తులు తెలిపారు.