రైల్వే ప్లాట్‌ఫాంపై మహిళకు పురుడు పోసిన వ్యక్తి.. ఎలా చేశాడంటే!

ముంబయి రాంమందిర్‌ రైల్వే స్టేషన్‌లో ఓ యువకుడు తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడాడు. లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న వీడియోగ్రాఫర్‌ వికాస్‌ బెద్రే (27) పక్క కంపార్ట్‌మెంట్‌లో గర్భిణి అంబికా ఝా (24)కు పురిటినొప్పులు రావడంతో అత్యవసర చైన్‌ను లాగి రైలును ఆపాడు. తన స్నేహితురాలు డాక్టర్ దేవికా దేశ్‌ముఖ్‌తో వీడియోకాల్‌లో సూచనలు తీసుకుంటూ ప్లాట్‌ఫాంపైనే ప్రసవం విజయవంతంగా పూర్తి చేశాడు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండగా.. సమయస్ఫూర్తితో ప్రాణాలు కాపాడిన వికాస్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

సంబంధిత పోస్ట్