చైనాలోని వుహాన్‌కి చెందిన ఓ మహిళ 22 ఏళ్లుగా ఓ ధర్మామీటర్ ముక్కను శరీరంలో పెట్టుకుని అలానే జీవించింది. చిన్నప్పుడే అనుకోకుండా థర్మామీటర్‌పై కూర్చోవడంతో 2 సెంటీమీటర్ల పొడవున్న ముక్క ఆమె బాడీలో ఇరుక్కుపోయింది. అప్పటి నుంచి కూర్చున్నప్పుడు నొప్పి వస్తోందని బాధపడుతూ ఇటీవల ఆస్పత్రిని ఆశ్రయించింది. సీటీ స్కాన్‌లో గుట్టు బయటపడగా, డాక్టర్లు సర్జరీ చేసి తొలగించారు. అదృష్టవశాత్తు అందులో పాదరసం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.