జపాన్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన బహుమతి అందింది. తకసాకిలోని షోరింజన్ దరుమాజీ ఆలయ ప్రధాన పూజారి ఆయనకు దరుమా బొమ్మను కానుకగా ఇచ్చారు. ఈ దరుమా బొమ్మని జపాన్ సంప్రదాయంలో అదృష్టం, పట్టుదలకు ప్రతీకగా సూచిస్తారు. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో కలిసి 15వ భారత్-జపాన్ శిఖరాగ్ర సమావేశానికి హాజరైన సందర్భంలో అందిన ఈ కానుక, ఇరుదేశాల స్నేహబంధానికి ప్రతీకగా నిలిచింది.