నేపాల్‌లో హింస చెలరేగిన నేపథ్యంలో సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ శాంతి కోసం వినూత్నంగా సందేశం ఇచ్చారు. ఒడిశా పూరీ తీరంలో నేపాల్ పార్లమెంట్ భవనం కాలిపోతున్నట్లుగా శిల్పం తీర్చిదిద్దారు. దీని కింది భాగంలో శాంతి కోసం ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. నేపాల్ జాతీయ జెండాతో మలిచిన ఆ సైకత శిల్పం చూపరులను ఆకట్టుకుంటోంది.