పేరులో చిన్న మార్పు ఓ కంపెనీ పతనానికి దారితీసింది. ఢిల్లీకి చెందిన బీరా 91 మాతృ సంస్థ 'బి9 బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్' తన చట్టపరమైన పేరును 'బి9 బేవరేజెస్ లిమిటెడ్'గా మార్చింది. పేరు చివర ఉన్న 'ప్రైవేట్' అనే పదాన్ని తొలగించడం అతి పెద్ద సమస్యకు దారితీసింది. కొత్త పేరుతో వచ్చిన బీర్లు పాత కంపెనీవే అని నమ్మక రాష్ట్రాల్లో నిషేధించారు. ఉత్పత్తీ నిలిచిపోయింది. రూ.748 కోట్ల నష్టంతో సిబ్బందికి జీతాలూ చెల్లించకపోయింది. కంపెనీ CEO జైన్ను తొలగించాలని ఉద్యోగులు పిటిషన్ వేశారు.