ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో పూర్ణియా స్పెషల్ ట్రైన్‌లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఢిల్లీ నుంచి బీహార్ వెళ్తున్న రైలు సాహిబాబాద్ వద్దకు చేరుకున్నప్పుడు లగేజ్ కోచ్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఘజియాబాద్‌లో రైలును నిలిపి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, వారు వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.