బాలికల కళాశాల ముందు పుష్అప్స్ తీసిన యువకుడు.. చివరికి? (వీడియో)

అమ్మాయిల ముందు ఫోజులకు పోయిన ఓ వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఓ యువకుడు బాలికల కళాశాల ముందు చొక్కా లేకుండా పుష్‌అప్స్, డిప్స్ ప్రదర్శించాడు. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ వీడియో వైరల్ కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పోలీసులు సదరు యువకుడిని అరెస్టు చేసి, అతనిపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్