ప్రేయసితో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన యువకుడు.. చివరికి

ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలో ఒక ప్రేమకథ ఊహించని మలుపు తీసుకుంది. హమీర్‌పూర్‌కు చెందిన నిర్మల్ సింగ్ (22) అనే యువకుడు తన స్నేహితురాలిని కలవడానికి అర్థరాత్రి ఆమె ఇంటికి వెళ్ళాడు. అయితే, కుటుంబ సభ్యులు అతన్ని పట్టుకుని బంధించారు. ఉదయం పంచాయతీ పెద్దల సమక్షంలో, అమ్మాయి గౌరవాన్ని కాపాడేందుకు ఇద్దరికీ గ్రామంలోని ఆలయంలో వివాహం చేశారు. ఈ సంఘటన వైరల్ అవ్వడంతో, కొందరు దీనిని వ్యక్తిగత స్వేచ్ఛకు భంగంగా పరిగణిస్తున్నారు.

సంబంధిత పోస్ట్