బీహార్ సహర్సా జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పూజల పేరుతో యువతిపై ఓ తాంత్రికుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అరపట్టి గ్రామానికి చెందిన గోవింద్ ఝా.. 2024 మార్చిలో తన వద్దకు వచ్చిన ఓ అమ్మాయి చేత శుద్ధి పేరుతో పూజలు చేయించాడు. ఈ క్రమంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడి.. ఓ వీడియో రికార్డ్ చేశాడు. ఆ వీడియో చూపించి యువతిని బ్లాక్ మెయిల్ చేస్తూ ఏడాదిన్నరపాటుగా అత్యాచారం చేస్తున్నాడు. తాజాగా ఆ యువతి కుటుంబసభ్యులకు విషయం చెప్పగా.. వారు పోలీసులను ఆశ్రయించారు.