ట్రైన్‌లో జనరల్ రిజర్వేషన్‌కూ ఆధార్ తప్పనిసరి

రైలు టికెట్‌ జనరల్‌ రిజర్వేషన్‌కూ ఇకపై ఆధార్‌ అథెంటికేషన్‌ తప్పనిసరి కానుంది. ఈ నిబంధన బుధవారం నుంచే అమలులోకి వచ్చింది. జనరల్‌ రిజర్వేషన్‌ ఓపెనైన తొలి 15 నిమిషాల వరకు ఈ రూల్‌ వర్తిస్తుంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌లలో టికెట్‌ బుక్‌ చేసుకునే వారికి ఇది వర్తిస్తుంది. బ్రోకర్లు, ఏజెంట్ల వల్ల సాధారణ ప్రయాణికులకు టికెట్లు దక్కడం లేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, టికెట్‌ కౌంటర్లలో రిజర్వేషన్‌ చేసుకునే వారికి మాత్రం ఆధార్‌ అవసరం లేదు.

సంబంధిత పోస్ట్