ఆసియా కప్ 2025లో భాగంగా యూఏఈతో టీమిండియా బుధవారం తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం టీమిండియాకు ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ నిర్వహించారు. ఈ ప్రాక్టీస్ సెషన్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ భారీగా సిక్స్‌లతో విరుచుకుపడ్డాడని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ప్రాక్టీస్ సెషన్‌కు సంజు శాంసన్, బుమ్రా హాజరు కాలేదని సమాచారం. అవసరం లేదనుకుంటే హాజరు కాకుండా ఉండే అవకాశం ప్లేయర్లకు ఉంది. అందుకే వారు హాజరు కాలేదని తెలుస్తోంది.