ఉత్తరాఖండ్ రూర్కీలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డు మధ్యలో ఆపి ఉంచిన కారు డ్రైవర్ అకస్మాత్తుగా డోర్ తెరిచాడు. వెనుక నుంచి ఓ బైకర్ ఆ కారు డోరును ఢీకొట్టి కింద పడ్డాడు. వేగంగా వచ్చిన ట్రక్కు ఆ బైకర్‌పై నుంచి వెళ్లింది. దీంతో స్పాట్‌లో ఆ యువకుడు చనిపోయాడు. ప్రమాదం తర్వాత పరారైన కారు డ్రైవర్ గురించి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రమాద వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.