TG: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన తల్లి కుమార్తెలు మృతిచెందారు. రెడ్డి కాలానికి చెందిన విఘ్నేష్, రమాదేవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు స్రవంతి, తేజస్వి. వీరికి పెళ్లిళ్లు కాగా.. USలో స్థిరపడ్డారు. తేజస్వి ఫ్యామిలీ USలో నూతన గృహ ప్రవేశం చేయగా, కుటుంబ సభ్యులంతా వెళ్లారు. ఆ తర్వాత అందరూ కలిసి స్రవంతి ఇంటికి కారులో వెళ్తుండగా ట్రక్కు ఢీకొట్టింది. రమాదేవి, తేజస్వి ప్రాణాలు కోల్పోగా మిగిలిన వారికి గాయాలయ్యాయి.