TG: చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో రోడ్లు బాగుంటేనే ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని వెల్లడించారు. రోడ్లు మంచిగా లేకుంటేనే యాక్సిడెంట్స్ తక్కువ అవుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. రోడ్లు ఖరబ్ వుండటం వల్ల వాహనాలు నెమ్మదిగా వెళ్లి ప్రమాదాలు తక్కువగా జరుగుతాయని అన్నారు. కాగా నిన్న జరిగిన మీర్జాగూడ రోడ్డు ప్రమాదం గత BRS ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనేనని ఆయన ఆరోపనలు చేసిన విషయం తెలిసిందే.