మహారాష్ట్ర గవర్నర్‌గా ఆచార్య దేవవ్రత్ సోమవారం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనను ప్రమాణం చేయించగా, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, మంత్రులు, ఉన్నతాధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం గుజరాత్ గవర్నర్‌గా ఉన్న దేవవ్రత్‌కు రాష్ట్రపతి అదనపు బాధ్యతలు అప్పగించారు. 1959 జనవరి 18న జన్మించిన దేవవ్రత్, విద్యావేత్తగా, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా కూడా పనిచేశారు.