ఉత్తరప్రదేశ్ భదోహి జిల్లాలో ముకేష్ అనే వ్యక్తి తన మేనకోడలిపై యాసిడ్ దాడి చేశాడు. ఆమె పెళ్లి వేరొకరితో నిశ్చయం కావడంతో ఆగ్రహం చెందిన ముకేష్ ఈ చర్యకు దిగాడు. దాడిలో యువతి ముఖం ఒకభాగం కాలిపోయింది. ఘటన తర్వాత పారిపోయిన ముకేష్‌ను పోలీసులు కాలిపై కాల్చి అదుపులోకి తీసుకున్నారు. తన మేనకోడలిని ప్రేమిస్తున్నానని, ఆమెను ఎవరికీ ఇచ్చేది లేదని ముకేష్ పోలీసులకు తెలిపాడు.