TG: టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. “హైదరాబాద్ మళ్లీ మునిగింది.. హామీలన్నీ విఫలమయ్యాయి. అన్నింటినీ చక్కబెట్టేందుకు కేసీఆర్, కేటీఆర్ రావాలని జనం కోరుకుంటున్నారు” అని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. మరో ట్వీట్‌లో “గాంధీ సాధువు కాదు.. అతను మహాత్ముడే కాదు” అంటూ వ్యాఖ్యానించారు. రాహుల్ రామకృష్ణ వరుస ట్వీట్లు ఎందుకు చేస్తున్నారో తెలియక నెటిజన్లు ప్రశ్నిస్తూ వివిధ కామెంట్లు చేస్తున్నారు.